Thursday, 3 August 2017

Kammarastra Kammanadu Kamma kshatriyas - Telugu

Kammarastra Kammanadu Kamma Kshatriyas - Telugu
సుర్యచంద్ర వంశజులైనా కాంబోజ జాతి కమ్మ క్షత్రియులు తెలుఁగు నేలకి అడుగిడినారు.వారు
 కృష్ణ నది తీర ప్రాంతాలలో ఉంటూ రాజ్యలను ఏర్పరుచుకొని పరిపాలన సాగించరు కనుక ఈ ప్రాంతానికి కమ్మ రాష్ట్రం కమ్మ నాడు పిలువ బడినది. ఈ ప్రాంతం లో బుద్ధిజం బాగ వ్యాప్తి చెందినది కమ్మరాష్ట్రం కమ్మనాడులను పాలించిన కమ్మ క్షత్రియ వంశాలలో "కమ్మదుర్జయ వంశం "చాళుక్య వంశం"
"హైహయ వంశం" "పల్లవ వంశం" లు ముఖ్యమైనవి. ఆ తరువాత కమ్మ నాడులోని కొంత భాగం పల్నాడుగా పల్లవులు పలిచటం వలన ఇలాగ పిలవ బడినది ఆ తరువాత  వెలనాటి చోడులు కొంత బాగం పాలిచటం వలన  వెలనాడుగా పిలువబడినది.

#కమ్మరాష్ట్రం అనగా, కమ్మ అనగా కమ్మ , రాష్ట్రం అనగా రాజులు అనగా కమ్మరాజులు కమ్మ క్షత్రియులు అని అర్థం

కమ్మ రాష్ట్రం = కమ్మ రాజులు, కమ్మ క్షత్రియులు

#కమ్మనాడు అనగా, కమ్మ అనగా కమ్మ, నాడు అనగా నాయుడులు రాజులు అంటే కమ్మనాయుడులు కమ్మరాజులు అని అర్థం

కమ్మనాడు = కమ్మ నాయుడులు లేక కమ్మ రాజులు కమ్మ క్షత్రియులు అని అర్థం.

                            కమ్మనాడు/ కమ్మరాష్ట్రం కమ్మరథం అను ప్రాంతము భౌగోళికముగా తీరాంధ్రప్రాంతము లోనిది. కమ్మరాష్ట్రంనకు తూర్పు సముద్రము, దక్షిణము నెల్లూరు, పడమర శ్రీశైలం, ఉత్తరం ఖమ్మం వరంగల్ హద్దులుగా ఉండేవి. చారిత్రకముగా కమ్మనాడు ప్రస్తావన క్రీస్తు శకము మూడవ శతాబ్ది నుండి 1428 తక్కెళ్ళపాడు శాసనములవరకు మనకు కనపడును. కమ్మనాడు అను పదము కర్మరాష్ట్రము (సంస్కృతము) లేక కమ్మరాట్టము (పాళి) నుండి పరిణామము చెందినది. ఈ ప్రాంతములో బౌద్ధమతము క్రీస్తు పూర్వము నాలుగవ శతాబ్ది నుండి పరిఢవిల్లుచున్నది. తేరవాద బౌద్ధ కర్మ (కమ్మ) సిద్ధాంతము నుండి ఈ పదము ప్రాంతమునకు అన్వయించబడినది...కమ్మరాష్ట్రం కమ్మరథం కమ్మనాడు కమ్మరాష్ట్రము, కమ్మరట్టము, కమ్మకరాటము, కర్మరాష్ట్రము, కర్మకరాటము, కర్మకరాష్ట్రము మరియు కమ్మకరాష్ట్రము

కర్మరాష్ట్రము లోని భట్టిప్రోలు, ధరణికోట, విజయపురి శాతవాహనులకు, ఇక్ష్వాకులకు పట్టుకొమ్మలు. ఇచ్చటి బౌద్ధ స్తూపములు, చిత్రకళ, శిల్పము ప్రపంచ ఖ్యాతి గాంచినవి...

#కమ్మరాష్ట్రం శాసనములు

1. కర్మరాష్ట్రము అను పదము మొదట ఇక్ష్వాకు రాజు మాధారిపుత్ర పురుషదత్తుని బేతవోలు (జగ్గయ్యపేట) శానములో గలదు (3వ శతాబ్దము).
2. అటుపిమ్మట పల్లవ రాజు రెండవ కుమార విష్ణుని చెందులూరు గ్రామశాసనములో దొరికినది.
3. మూడవ ఆధారము తూర్పు చాళుక్య రాజు మంగి యువరాజ (627-696) శాసనము:
శ్రీసర్వలొకాశ్రయ మహరాజః కమ్మరాష్ట్రె చెందలూరి గ్రామే
4. మూడవ శతాబ్దమునుండి పదకొండవ శతాబ్దము వరకు శాసనములలో కమ్మరాష్ట్రము, కమ్మరట్టము, కమ్మకరాటము, కర్మరాష్ట్రము, కర్మకరాటము, కర్మకరాష్ట్రము మరియు కమ్మకరాష్ట్రము పర్యాయపదములుగా వాడబడినవి.
5. రాజరాజనరేంద్రుని సమకాలీకుడగు పావులూరి మల్లన (1022-1063) ఈ విధముగా వ్రాసెను:
ఇల కమ్మనాటి లోపల విలసిల్లిన పావులూరి విభుడన్
6. తెలుగు చోడుల మరియు కాకతీయుల శాసనములలో కమ్మనాడు (కొణిదెన శాసనము-త్రిభువనమల్ల – 1146). కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని కాలములో బొప్పన కామయ్య కమ్మనాటిని కాట్యదొన (కొణిదెన) రాజధానిగా పాలించుచుండెను......

కమ్మ అను పదము క్రీస్తు కాలము నుండి కలదు. కమ్మనాడు, కమ్మ రాష్ట్రం అను ప్రదేశాల పేర్లు పెక్కు శాసనములలో పేర్కొనబడినవి. గంగా నదీ మైదానములోని బౌద్ధులు పుష్యమిత్ర సుంగ (184 BCE) యొక్క పీడన తప్పించుకోవడానికి పెద్ద సంఖ్యలో కృష్ణా నది డెల్టాకు వలస వచ్చారు. వీరివలన బౌద్ధమతం ఈ సారవంతమైన ప్రాంతంలో పలు శతాబ్దములు పరిఢవిల్లింది. ఇప్పటికీ ధరణికోట, భట్టిప్రోలు, చందవోలు మున్నగు ఊళ్ళు ఆనాటి చరిత్రకు ఆనవాళ్ళు. చరిత్రకారులు కర్మ అనబడు సంస్క్రిత పదము తరువాత సంవత్సరాలలో కమ్మ (పాళి పదం) గా మారింది. కమ్మనాడు అనబడు ఈ ప్రాంతములో వసించు వారే పిమ్మట కమ్మవారయ్యారు. చారిత్రకముగా కమ్మవారు ఒక కులముగా పదవ శతాబ్దము నుండి తెలియబడుతున్నారు. గుంటూరు జిల్లా ముప్పళ్ళ మండలం మాదాల గ్రామంలో ఉన్న సాగరేశ్వర ఆలయంలో 1125 వ సంవత్సరం నాటి పిన్నమ నాయుడి శిలా శాసనంలో కమ్మ వారు దూర్జయ  అను క్షత్రియ కులానికి చెందినవారని, తాను వల్లుట్ల గోత్రానికి చెందినవాడుగా తెలుపుచున్నది. పల్నాటి యుద్ధము తరువాత, కమ్మవారు కాకతీయ రాజులుగా కాకతీయ సైన్యాధ్యక్షులుగా పనిచేశారు. కాకతీయ రాజైన గణపతిదేవ మహారాజు తన సైన్యాధ్యక్షుడైన జయప సేనాని చెల్లెళ్ళను కమ్మ రాణులు నారమ్మ, పేరమ్మ లను వివాహమాడాడు. ఇందువల్ల గణపతిదేవుడి కుమార్తె రుద్రమదేవిని కమ్మవారు తమ ఆడపడుచుగా భావిస్తారు.

కమ్మ రాష్ట్రా ప్రాంత కమ్మ క్షత్రియ వంశాలు
దుర్జయ, చళుక్య, చోడ(చొళ), హైహయ

కమ్మరాష్ట్ర కమ్మనాడు ప్రాంత రాజ్యలు

1ఇక్ష్వాక కమ్మ సామ్రాజ్యం

2 దుర్జయ కమ్మ సామ్రాజ్యం

3చాళుక్య కమ్మ సామ్రాజ్యం

4 వెలనాటి చోడ కమ్మ సాంరాజ్యం
    (కమ్మ దుర్జయ వంశం)

5 పల్లవ రాజ్యం

6కాకతీయ కమ్మ సామ్రాజ్యం
    (కమ్మ దుర్జయ వంశం)

7 ముసునూరు కమ్మ సామ్రాజ్యం
     (కమ్మ దుర్జయ వంశం)

8హైహయ కమ్మ రాజ్యం

9 పెమ్మసాని కమ్మ సామ్రాజ్యం
    (కమ్మ దుర్జయ వంశం)

10రావెళ్ళ కమ్మ రాజ్యం
    (కమ్మ దుర్జయ వంశం)

11సూర్యదేవర కమ్మ రాజ్యం
     (సూర్య వంశస్తులు )

12 సాయపనేని కమ్మ రాజ్యం
     (కమ్మ దుర్జయ వంశం)

13 వాసిరెడ్డి కమ్మ రాజ్యం
     (చాళుక్య వంశస్తులు)

14యార్లగడ్డ కమ్మ రాజ్యం
 (వెలనాటి చోడ కమ్మ దుర్జయ వంశజులు)

15మదురై  కమ్మ నాయకర్ రాజ్యం
     (కమ్మ దుర్జయ వంశం)

16తంజావూర్ కమ్మ నాయకర్ రాజ్యం
     (కమ్మ దుర్జయ వంశం)

17కాండీ కమ్మ నాయకర్ రాజ్యం
     (కమ్మ దుర్జయ వంశం)

Kamboja Kamma Kshatriyas - Telugu

Kamboja Kamma Kshatriyas - Telugu
#కమ్మప్రభులు
#కాంబోజఆర్యులు #కమ్మక్షత్రియులు
సుర్య చండ్ర వంశముల వారు 16 మహాజన పద అర్య క్షత్రియ జాతులుగా ఏర్పడినారు వాటిల్లో కాంబోజ అనే అర్య క్షత్రియజాతి ఒకటి  దుర్యోధనుడి రాజ్యలో కాంబోజ కూడా ఒకటి యుద్దలో దుర్యోధనుడికి తొడుగా కాంబోజ క్షత్రియ రాజ్యం కూడా నిలిచింది.

           కాంబోజ = కమ్మ+భోజ  కమ్+భోజ్

                      భారతదేశం లొని కమ్ కుం జాతి సంబంధీకులు కాంభోజులుగా చెప్ప బడుతున్నది వీరే కమ్మ క్షత్రియులు కుర్మి క్షత్రియులు కాంభోజ క్షత్రియులు మరియు తది తరులుగా చెప్పబడు చున్నది.చరిత్రకారుడు అవధ్ బీహారీ లాల్ అవస్తి దక్షిణ భరతమున కమ్మ కంభి కుమ్బి వారు ఉన్నారు తమిళనాడులొ పేరుగాంచిన నగరం కోయంబత్తూర్ ఉంది దీనిని పురాతన కాలంలో కాంబోజ ప్రాంతం గా పిలిచేవారు కావాలంటే గరుడ పురాణం అధ్యాయం P28 లో చూడవచ్చు అనిచెప్పటం జరిగింది.

                   చరిత్రలో మనం కాంబోజ రాజు కథలు వినే ఉంటాము వారి పరిపాలన దక్షత సైనిక బలగం కాంబోజ రాజుల సాహసో పరమైన ధీర గణ్ణం ఈ కధలో వినవచ్చు.ఈ కాంభోజులు , తెలుఁగు ప్రాంతం అయిన నేటి  ఆంధ్ర ప్రాంతానికి కృష్ణ నదీతీర ప్రాంతాలకి వచ్చి, రాజ్యాలని ఏర్పరుచు కొన్నారు ఆ ప్రాంతం ఆ తరువాత కమ్మరాష్ట్రం కమ్మనాడు గా పిలవ బడినది దీనిని పాలించిన వారే కమ్మ క్షత్రియులు కమ్మవారు.
       
                    కాంబోజ గురించి తెలుసుకోవటానికి సింధులో చారిత్రక అచ్చులు ఆధారాలను బట్టి కంబ్, కంబు నదులు కంభోహ్ కంబో పర్వతాలు ఉన్నాయని కాంబోజ సంసకృత్ (సింద్, P44 M R Lamrick) నుండి తెలుసు కొనవచ్చు.పఠాన్ అనే జిల్లలో పురాతన కాంబోజ నగరం వున్నది ఆనంద్ అనే జిలలో కాంబోజ నగరం ఉన్నది  మహారాష్ట్రలో కోలాలంపూర్ లో కాంబోజ అనే అతిపురాతన నగరం ఉన్నది  తమిలనాడు లొని కోయంబత్తూర్ ను అతి పురాతన కాంబోజ ప్రాంతం గా చెప్పడం జరిగింది ఇప్పుడు కోయంబత్తూర్ ప్రాంతం లో ఎందరో కమ్మవారైన పారిశ్రామిక వేత్తలను మనం చూడ వచ్చు .ఇపుడు మహరాష్ట్రలోని నందేడ్ ప్రాంతాలల్లో కాంబోజ జాతి ప్రజలు అక్కడ నివసించటం మనం గమనించ వచ్చు అలాగే కాంబోజ జాతి వీరులైన కమ్మవారు కమ్మ క్షత్రియులు నేటి ఆంద్ర తెలంగాణ రాయలసీమ తమిళనాడు కర్ణాటక ఇతర దేశాలైన అమెరికా సింగపూర్ రష్యా దుబాయ్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ లో స్థిర పడ్డారు .

Lord Vishnu Murthy Kurma Avatar Kamma Kshatriya origen (Krutha Yuga, Vedic Period) - Telugu

Lord Vishnu Murthy Kurma Avatar Kamma Kshatriya Origen (Krutha Yuga,Vedic Period) - Telugu
వేద కాలంలో విష్ణుమూర్తి పాల సముద్రంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీర సాగర మధనం చేసేటపుడు కుర్మా అవుతారని దరిస్తాడు.అప్పుడు దేవతల రాక్షసులు కలిసి చిలికి నపుడు అమృతం వస్తుంది అప్పుడు విష్ణుమూర్తి చెంత ఉన్న కూర్మారాధకులైన కొంత మంది వీరులు రాక్షసులతో పోరడుతూ విష్ణుమూర్తి చెంత నిలిచారు.ఆ తరువాత విష్ణు మూర్తి మోహిని అవతారని
ధరించి దేవతలకు అమృతం దక్కించి రాక్షసులను  కూర్మారాధకులతో కలసి పోరాడి విజయం సాధిస్తాడు.
                  ఈ కూర్మారాధకులే కూర్మరాధక క్షత్రియులు వీరి నుండే  కుర్మీ కర్మ(లేక) కమ్మ ఏర్పడాయి నేడు వీరు భారత థేసమ్ లో చాలా ప్రాంతలో ఉన్నారు దక్షిణ భరత దేశంలోని ఆంద్ర తెలంగాణ రాయలసీమ తమిలనాడు కర్ణాటక లొని కమ్మవారిని  ఉత్తర భరత దేశంలో కుర్మి కుంభి కంభి జాతులు మనం చూడవచ్చు.

              వీటిని మార్కండేయ పురాణం పద్మ పురాణం లింగ పురణం దౌర్వాసా దేవి పురణం నుండి తీసుకొన బడినది.

#కూర్మారాధకులు
#కుర్మిక్షత్రియులు #కమ్మక్షత్రియులు

Goddess Lakshmi Kamma Kshatriya Birth (Purana) - Telugu

Goddess Lakshmi Kamma Kshatriya Birth (Purana) - Telugu
తపసు చేసుకొనే ఋషులను నిత్యం రాక్షసులు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటే ఋషులు శ్రీ మహావిష్ణువు ఆశ్రయం కోరగా అప్పుడు విష్ణు మూర్తి మీకు లక్శ్మి మాత శరణు జొచ్చును అని వేడుకొనగా ఋషులు లక్శ్మి మాత చెంత కేగి వారి బాధని విన్నవించు కుంటారు.అప్పుడు లక్శ్మి మాత తన చెవి కమ్మ ని వారి రక్షణ కొరకు ఇస్తుంది వారు 100 సంవత్సరాలు దానిని పూజించు కొంటూ రాక్షసులబారి నుండి రక్షించ బడుతూవుంటారు 100 సంవచ్చారాల కాల సమయం అయిన తరువాత తిరిగి రక్షసులు యధావిధిగా ఋషులను వేదేస్తూవుంటే ఆ కమ్మ నుండి 500 మంది యుద్ధవీరులు(క్షత్రియులు) పుట్టి రాక్షసులందరిని సహరించి యోధులుగా నిలుస్తారు వారే కమ్మక్షత్రియులు కమ్మవారు.
                               అప్పుడు లక్శ్మి దేవత ప్రత్యక్షం అయి వారి పరాక్రమానికి మెచ్చి వారికి పెద్ద పెద్ద సారవంత భూములు ఇచ్చి సేద్యం చెస్తూ ప్రజలని సుభిక్షంగా పరిపాలించమని చెప్పి ఆశీర్వదించి వైకుంఠం వెళ్తుంది ఇది దేవి పురాణంలో చెప్పబడినది.